న్యూఢిల్లీ : మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై సోమవారం నాడు సీనియర్ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలి యంశాఖ మంత్రి హరదీప్ సింగ్ పురీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం సుమారు రెండు గంటల సేపు జరిగింది. అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనను ముగించుకుని వచ్చిన తరువాత తాపీగా ఈ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో అమిత్ షా నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఎలాంటి ఫలితమూ ఇవ్వలేదు. మణిపూర్‌లో మే 3 నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న హింసాకాండలో జరిగిన నష్టం గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కోన్నారు. మణిపూర్ ప్రభుత్వం అభ్యర్థిస్తున్న ఆర్థిక ప్యాకేజీపై కూడా సోమవారం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మణిపూర్‌లో పరిస్థితిపై చర్చించేం దుకు ఆదివారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో బీరేన్‌సింగ్ మాట్లాడు తూ నూతన శాంతి ప్రక్రియను ప్రారంభిస్తానచెప్పారు. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో హింసాకాండను నివారించడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండాలో ఇప్పటి వరకూ 131 మందికి పైగా మరణించగా, అనేక వందల మంది గాయప డ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, దుకాణాలకు నిప్పు పెట్టారు.