నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఐదేండ్లలో బడా కార్పొరేట్లకు రూ.10,57,326 కోట్లు మాఫీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖరడ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19లో రూ. 2,36,265 కోట్లు మాఫీ చేయగా, అందులో రూ.1,29,765 కోట్లు ప్రభుత్వ బ్యాంకులు, రూ.15,966 కోట్లు ప్రయివేట్ బ్యాంకులు మాఫీ చేశాయి. రూ. 3,023 కోట్లు విదేశీ బ్యాంకులు మాఫీ చేశాయి. 2019-20లో రూ. 2,34,170 కోట్లు మాఫీ చేయగా, రూ.1,34,189 కోట్లు ప్రభుత్వ, రూ.21,199 కోట్లు ప్రయివేట్, రూ.3,750 కోట్లు విదేశీ బ్యాంకులు మాఫీ చేశాయి. 2020-21 రూ. 2,02,781 కోట్లు మాఫీ చేయగా, అందులో రూ.96,232 కోట్లు ప్రభుత్వ, రూ.28,867 కోట్లు ప్రయివేట్, రూ.1,948 విదేశీ బ్యాంకులు మాఫీ చేశాయి. 2021-22 రూ.1,74,966 కోట్లు మాఫీ చేయగా, అందులో రూ.58,875 కోట్లు ప్రభుత్వ, రూ.9,037 కోట్లు ప్రైవేట్, రూ.1,613 కోట్లు విదేశీ బ్యాంకులు మాఫీ చేశాయి. 2022-23లో రూ.2,09,144 కోట్లు మాఫీ చేయగా, రూ.67,045 కోట్లు ప్రభుత్వ, రూ. 41,194 కోట్లు ప్రయివేట్, రూ.1,138 విదేశీ బ్యాంకులు రుణాలు మాఫీ చేశాయి.