కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్

నవతెలంగాణ  -హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేశారు. ఆదివారం ఖర్గేతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ ప్రచారంపర్వం ముగిసింది. చివరి రోజైన ఆదివారం కథువాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగిస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోయినట్లు కనిపించింది. పక్కనే ఉన్న ఆయన భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు వెంటనే గమనించి నీళ్లు తాగించారు. కాస్త తేరుకున్న తర్వాత ఖర్గే తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.

Spread the love