– టాక్టర్స్, బైక్ లతో భారీ ర్యాలీ
నవతెలంగాణ – భువనగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధాలను రైతులు, కార్మికులు, కర్షకులు ప్రజా సంఘాలు ఐక్యంగా ఉండి వాటిని తిప్పి కొట్టాలని ఎస్ కె యం యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొల్లూరి రాజయ్య, మాటూరి బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంధు సమ్మెను జయప్రదం చేయాలని ఎస్ కె ఎం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో టాక్టర్స్, బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమై వినాయక చౌరస్తా, కొత్త బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ మీదుగా జగదేవపూర్ చౌరస్తా నుండి తిరిగి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాల వలన అవలంబిస్తున్న కార్పోరేటు మతోన్మాద విధానాల మూలంగా దేశంలోని కార్మిక వర్గం రైతాంగం పేద ప్రజలందరూ అనేక ఇబ్బందులుఎదుర్కొంటున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదించడం జరిగిందని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలను అమలు చేయకుండా కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు.అదేవిధంగా రైతులకు ఉరితాడు బిగించే విధంగా తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దేశంలోని రైతాంగం పోరాటం ద్వారా వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని మళ్లీ వాటి అమలకు ప్రయత్నంకొనసాగిస్తుందనిఆరోపిం చారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తుందన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను తగ్గించి వ్యవసాయ కార్మికులను మోసం చేస్తుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయిన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. నిత్యవసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతూ పేదలపై భారాలు మోపుతూ అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేటు కంపెనీలకు కారు చౌకగా కట్టబెట్టిందన్నారు. ఒకవైపు కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను దూకుడుగా అవలంబిస్తున్నారన్నారు మరోవైపు ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందన్నారు. అందులో భాగంగానే దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య చేసి వచ్చే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి ని ఓడించమే కోసం దేశంలోని అన్ని జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజ్, రైతు సంఘం జిల్లా నాయకులు బట్టు రామచంద్రయ్య, తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవిడి ఉప్పలయ్య, ఏ.ఐ. కె. ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కళ్లెం అడివయ్య, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా కార్యదర్శి చిరబోయిన రాజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి ఇమ్రాన్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం, డి ఎహ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి కాశపాక దయాకర్, రైతు సంఘo జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల కొమరయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాoడు, రైతు సంఘం జిల్లా నాయకులు బబ్బురి పోశెట్టి నూకల భాస్కర్ రెడ్డి, బండి రవి, బండి శ్రీను. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, సీఐటీయూ జిల్లా నాయకులు మాయ కృష్ణ, ఏఐకెఎం. ఎస్ జిల్లా నాయకులు నేరేడు స్వామి, సామల శోభన్ బాబు, గణబోయిన వెంకటేష్, సామల భాస్కర్ పాల్గొన్నారు.