దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ విధానాలు

Destroying the country Modi policies– ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– నారాయణపేట సీపీఐ(ఎం) జిల్లా మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ మక్తల్‌
దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోడీ విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్‌ పట్టణంలో సీపీఐ(ఎం) ద్వితీయ జిల్లా మహాసభలు ఆదివారం ప్రారంభమ య్యాయి. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహిం చిన బహిరంగసభలో జూలకంటి మాట్లాడారు. ప్రపంచంలో కమ్యూనిస్టుల శక్తి పెరుగుతు న్నదని, ప్రజా సమస్యలకు నిజమైన పరిష్కారం చూపగలిగే సత్తా సీపీఐ(ఎం)కి ఉందని తెలిపారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, సాగు భూముల కోసం పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోడీ దేశ సంపదను సంపన్నులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. మతోన్మాద రాజకీయాలతో దేశంలో విద్వేషం పెంచుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతులు పంట పెట్టుబడికి అప్పులు చేస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ, టి.సాగర్‌ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న బోజన కార్మికులు, క్షేత్ర సహాయకులు, పశుమిత్రులు, భవన నిర్మాణ కార్మిక, హమాలీల సమస్యలపై పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని చెప్పారు. బీజేపీ దేశ సంపదను కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు రూ.14 వేల లక్షల కోట్లు మాఫీ చేశారని తెలిపారు. కానీ రైతుల రుణాలను మాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రుణాలు కట్టని వారిపైకి దౌర్జన్యంగా వస్తున్నారని అన్నారు. కార్మిక, కూలీలకు నష్టం కలిగించే విధానాలు అమలుచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, ఆర్‌. వెంకట్రాములు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్‌, పుంజనూరు ఆంజనేయులు, బండమీది బాలరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love