మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు ఎక్కడా..

– దేశం కోసం ప్రాణా త్యాగం చేసిన మహాత్ముడు గాందీ..
– ఎంపి అరవింద్ కంటే మోదీ పేద్ద అబద్దాల కోరు…
నవతెలంగాణ- డీచ్ పల్లి
మోదీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలుకు అతిగతి లేదని, దేశం కోసం ప్రాణా త్యాగం చేసిన మహాత్ముడు గాంధీ అని ప్రత్యేక జయంతి ఉత్సవాల సందర్భంగా సమాధి వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టడం తిరిగివచ్చి గాంధీని చంపిన గాడ్సేను పొగడడం మోడీకి, బిజెపి కే చెల్లిందని, ఎంపి అరవింద్ కంటే మోదీ పేద్ద అబద్దాల కోరని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల ఇస్తానని చెప్పి నేటి వరకు ఆ ఊసు ఎత్తడం లేదని ప్రజలకు యువతకు పెడుదువ పట్టించడానికి జిల్లా పర్యటనకు వస్తున్నాడని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. 21 కోట్ల నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇందల్ వాయి మండలంలోని తిర్మన్ పల్లి, వెంగల్పాడ్, అన్సాన్ పల్లి, ఎల్లారెడ్డిపల్లి, గన్నారం, నల్లవెల్లి, గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడని కాని ఏమైందని, మళ్ళీ ఎంపీగా పోటీ చేశాడన్నారు.కాంగ్రెస్ బిజెపి ప్రతిపక్షాల నాయకుల మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దని,మోడీ మాటలను నమ్మే పరిస్థితుల్లో నిజామాబాద్ ప్రజలు లేరని,పసుపు బోర్డు హామీలు నీటి మూటలే అని,హమి ఇచ్చినోడే దొరుకుతలేడని మోడీని ఎవరు పట్టుకుంటారని వివరించారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మాగాంధీ అని, అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రం నుండి ధర్పల్లి వయా సిరికొండ మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిని మరోమ్మత్తుల పనుల కొరకు 10 కోట్లు నిధులతో ప్రధాన రహదారిని పనులు చేసుకోవడం జరిగిందని, దీనికి బిజెపి నాయకులు గతంలో మట్టి పోసి, రాజకీయాలు చేశారన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ వారు అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తారా అన్న చందనంగా ప్రతిపక్ష నాయకుల తీరు ఉందన్నారు. తెలంగాణ వస్తే రైతుబంధు వస్తుందని, ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి పెన్షన్ రూపంలో ప్రజలకు అందజేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అబివృద్ధి  పరంగా చెరువులు, కుంటలు, కోట్ల రూపాయలతో మరమ్మతులను ప్రతి గ్రామంలో చేయడం జరిగిందని వెల్లడించారు. కుల వృత్తులను కాపాడేందుకు, ప్రతి ఒక్క వర్గానికి ఆర్థిక పరంగా అన్ని కులస్తులకు సమన్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్ అని కొనియాడారు. గుండ్ల కులస్తులకు చాపలు పంపిణీ, యాదవులకు మేకలు, గోర్లు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నా దానికి నిదర్శనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం ఉన్నాయన్నారు. మోధీ కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేదని, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటారని, తెలంగాణ వ్యతిరేకి మోధీ అని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో సామాజిక భద్రత కల్పిస్తున్నదని, బీడీ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్, రైతులకు 24 గంటలు కరెంట్ ప్రేమిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమలు అవుతలేవు, అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట, అన్నా చందంగా మారిందని వివరించారు. బిజెపి నాయకుల తీరు అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌కు మరోసారి తెలంగాణ ప్రజలు, రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.ఎలక్షన్ వస్తున్న సందర్భంగా ప్రతిపక్ష నాయకులు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ దగ్గరికి వస్తున్నారని, గతంలో ఇచ్చిన మాట పసుపు బోర్డు ఎక్కడ అని ప్రశ్నించారు.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అభివృద్ధి చేసే వారెవరో మాటలు చెప్పే వారెవరో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వివరించారు. రోడ్డు నుండి తిర్మన్ పల్లి  వరకు వయా గిరిజన మోడల్ స్కూల్ రోడ్డు నిర్మాణము కొరకు ₹ రూ 2 కోట్ల 30 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టాలనున్నట్టు తెలిపారు. తీర్మన్పల్లి గ్రామంలో వ్యయం: ₹రూ॥ 3 కోట్ల 51 లక్షల నిధులతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనము ప్రారంభించడం జరిగింది.గ్రామంలో విలువ రూ॥ ₹ 11.53 లక్షలు నిధులతో వైకుంఠధామంను ప్రారంభించడం జరిగింది,గ్రా॥ వెంగల్పాడ్ గ్రామంలో వ్యయం: రూ॥ 5.00 లక్షలు  నిధులతో ఇమ్యూనైజేషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.₹రూ 1 కోటి 30 లక్షలు వెంగళ్పాడ్ నుండి నల్లవెల్లి వరకు వయూ కేకే. తాండలో బి.టి. రోడ్డు రెన్యువల్ కు శంకుస్థాపన చేశారు. వెంగల్పాడ్ గ్రామంలో వ్యయం: రూ॥ 13.00 లక్షలు నిర్మించిన అంగన్వాడి భవనమును ప్రారంభించడం జరిగింది. R&B రోడ్డు నుండి అన్సాన్పల్లి గ్రామం వరకు B.T. రోడ్డు రెన్యువల్ కొరకు అంచనా విలువ: రూ॥ 54.00 లక్షలు నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది , అన్సాన్పల్లి గ్రామంలో ₹ రూ .25 లక్షల నిధులతో గోధం నిర్మాణం కొరకు శంకుస్థాపన, ₹ రూ 5 లక్షల నిధులతో నిర్మించిన ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. రూ॥ 85.00 లక్షలు నిధులతో అన్సాన్పల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన, అన్సాన్పల్లి గ్రామంలో అంచనా విలువ: రూ॥ 1 కోటి 61 లక్షలతో నిర్మించిన  33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రంను ప్రారంభించారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో వ్యయం: రూ॥5.00 లక్షలు నిధులతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో వ్యయం: రూ॥ 50.00 లక్షలు నిధులతో నిర్మించిన గ్రామంలో అంతర్గత సి.సి. రోడ్లు & మురికి కాలువలు, రూ॥ 80. లక్షల నిధులతో నిర్మించిన శ్రీ గంగమ్మ దేవి ఆలయం ప్రారంభోత్సవం, రూ॥ 7.50 లక్షలు నిధులతో నిర్మించిన ఎస్సి (మాదిగ) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్, జెడ్పిటిసి సుమన రవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, మండల అధ్యక్షులు చిలువేరి దాస్, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పులి శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లోలం సత్యనారాయణ , ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రఘునథన్ రాము, పాశం కుమార్, దాస్, క్రాంతి, సర్పంచ్ నరేష్, మోహన్ నాయక్, విజయ లక్ష్మి లక్ష్మారెడ్డి, మమతా శేఖర్,సుమిత్ర చందర్,ఎంపిటిసి బాబురావు, శ్రీనివాస్ యాదవ్, పులి సాగర్,పులి వసంత, సర్పంచులు,  ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love