15-17 వరకు ఆ మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రధాని మోడీ 15-17 వరకు జార్ఖండ్‌, గుజరాత్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రాష్ట్రాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. సెప్టెంబర్‌ 15వ తేదీ ప్రధాని మోడీ జార్ఖండ్‌లో టాటానగర్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌లో టాటానగర్‌ – పాట్నా వందేభారత్‌ రైలును ప్రారంభించినున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో 660 కోట్లకు పైగా విలువైన పలు రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. 20వేల మందికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన- గ్రామీణ లబ్ధిదారులకు మంజూరు లేఖలను మోడీ పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్‌ 16న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి సూర్య గర్‌ మఫ్ట్‌ బిజిలి యోజన లబ్దిదారులతో మోడీ చర్చించనున్నారు. ఆ తర్వాత గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో 4వ గ్లోబల్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌ అండ్‌ ఎక్స్‌ పో (రీ ఇన్వెస్ట్‌)ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్రంలో 8 వేల కోట్లతో పలు అభివృద్ధికర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్‌ 17 ఒడిశాలో పర్యటించనున్నారు. భువనేశ్వర్‌లో 3,800 కోట్ల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Spread the love