మొగిలి మృతి బాధాకరం. సూరపనేని సాయికుమార్

నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇమ్మడి మొగిలి మృతి చాలా బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురపనేని సాయికుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రానికి చెందిన ఇమ్మడి మొగిలి అనారోగ్యంతో మృతి చెందారు. మరణ వార్త తెలుసుకున్న సాయికుమార్ వెంటనే  మొగిలి భౌతికకాయాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  అదేవిధంగా మొగిలి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ దేవుడు ఆదుకోవాలని కాంక్షించడం జరిగింది. ఆయన మరణం తీరని లోటు అని తన యొక్క సానుభూతిని తెలియజేయడం జరిగింది. ఇమ్ముడు మొగిలి కుటుంబానికి తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. భౌతిక గాయాన్ని సందర్శించిన వారిలో గ్రామ కమిటీ అధ్యక్షులు అకినేపల్లి రమేష్ సీనియర్ నాయకులు జాలిపర్తి రామారావు డొంకా వెంకన్న ఎండి ఫక్రుద్దీన్ తుమ్మల శివ మునగాల వెంకన్న అబ్బాస్ తదితరులు ఉన్నారు.
Spread the love