జీవితంలో ఎదగాలని అనుకునే వారు అనేక అంశాలలో మంచి అలవాట్లు, స్వభావ లక్షణాలు కలిగి ఉండాలి. మనస్తత్త్వ శాస్త్రపరంగా చూస్తే, వారు కొన్ని ముఖ్యమైన మనోభావాలను, నైపుణ్యాలను అభివద్ధి చేసుకోవడం అవసరం. అవేంటో చూద్దాం…
మానసిక ధైర్యం (Psychological Resilience) : అడిగేటప్పుడు ‘కాదు’ అనే సమాధానం వస్తే భయపడకుండా, నిరాశ చెందకుండా ముందుకు సాగాలి. మానసిక స్థైర్యం కలిగిన వ్యక్తులు విఫలమైనా మళ్లీ ప్రయత్నిస్తారు. ఇది growth mindset (వద్ధి చెందే మనోభావం) అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది.
అప్రయత్న ధైర్యం ((Assertiveness) : అడగడంలో గర్వం లేకుండా, మొహమాటం లేకుండా, తన హక్కులను వదులుకోకుండా అడిగే విధానం ఎంతో ముఖ్యం. Assertive communication అంటే ఎదుటివారికి గౌరవంతో, మన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలగడం. ఇది self-confidence (ఆత్మవిశ్వాసం) తో ముడిపడి ఉంటుంది.
అంతర్గత ప్రేరణ ((Intrinsic Motivation) : బయటి ప్రేరణకు (రివార్డ్స్, గుర్తింపు) మాత్రమే ఆధారపడకుండా, ‘నాకు ఇది అవసరం’ అనే అంతర్గత ప్రేరణతో అడిగేవారు ఎక్కువగా విజయం సాధిస్తారు.Self-Determination Theory (SDT) ప్రకారం, స్వతంత్రత (Autonomy), నైపుణ్యం (Competence), సంబంధాలు కలిగినవారు సంతోషంగా, ధైర్యంగా ఉంటారు.
స్వీయ గౌరవం (Intrinsic Motivation) : తక్కువ ఆత్మగౌరవం ఉన్నవారు ‘నాకు అర్హత ఉందా?’ అనే సందేహంలో పడతారు. కానీ రవశ్రీట-షశీత్‌ీష్ట్ర (స్వీయ విలువ) ఉన్నవారు తమ అవసరాలను గౌరవంగా చెబుతారు.
సరైన అనుభవజ్ఞానం (Social Intelligence) : ఎప్పుడు, ఎవర్ని, ఎలా అడగాలి అన్న విషయం అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇతరుల భావాలను అర్థం చేసుకుని, సరైన సమయాన్ని ఎంచుకోవడం Emotional Intelligence (EQ) లో ఒక భాగం.
మొహమాటాన్ని జయించడం (Overcoming Fear of Rejection) : చాలా మంది ‘ఇది అడిగితే ఏమనుకుంటారు?’ అనే భయంతో వెనక్కి తగ్గుతారు. Cognitive Behavioral Therapy (CBT) ప్రకారం, ఈ భయం మన నెగటివ్ థాట్స్ వల్ల వస్తుంది.Positive Self-Talk (స్వయంగా ధైర్యం చెప్పుకోవడం) ద్వారా దీనిని అధిగమించవచ్చు.
సహజమైన సమర్థన (Negotiation Skills) : కేవలం అడిగితే చాలదు, కొంతమంది తనకు అవసరమైనదాన్ని సాధించేందుకు సమర్థంగా చర్చించగలగాలి. Win-Win Approach ద్వారా, రెండువర్గాల ప్రయోజనాలను కూడా దష్టిలో పెట్టుకుని అడగడం ఉత్తమం.
అంగీకారం – నిరాకరణను స్వీకరించగలగడం ((Handling Acceptance & Rejection Gracefully) : అడిగినప్పుడు సమాధానం ఎలాంటిదైనా ఉండొచ్చు. Rejection Sensitivity (తిరస్కరణ భయం) తగ్గించుకోవడం ద్వారా, ‘ఇప్పుడు కాదంటే తర్వాత అవకాశం వస్తుంది’ అనే దక్పథం అభివద్ధి చేయాలి.
జీవితంలో అడగడానికి సిద్ధంగా ఉండే వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన, మానసిక స్థైర్యం వంటి లక్షణాలను పెంపొందించుకోవాలి. ‘అడగకుండానే అమ్మ పెడుతుంది’ అనే సామెత నిజమే, కానీ సైకాలాజికల్ పర్స్పెక్టివ్ లో సరైన విధంగా, సరైన సమయానికి, సరైన మనస్తత్వంతో అడిగితే మాత్రమే మనం మంచి ఫలితాలను పొందగలుగుతాం.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్