నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే పథుమ్ నిస్సంక వికెట్ తీశారు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కారు. గతంలో దేబశిష్ మహంతి(1999), జహీర్ ఖాన్(2001, 2002, 2007, 09), ప్రవీణ్ కుమార్(2010) తొలి బంతికే వికెట్ తీశారు.