మోహన్ బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు. మంచు మనోజ్ ఒకలా, మంచు మోహన్ బాబు మరోలా.. ఇప్పుడు కొత్తగా మంచు విష్ణు కూడా రంగంలోకి దిగడంతో.. టాలీవుడ్ అంతా ఈ ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటోంది. ఇదిలా ఉంటే, మంచు మోహన్ బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి.. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండటంతో.. తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు మోహన్ బాబు పని మనిషి ఏం చెప్పిందంటే.. మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఇంటిలో పని చేస్తున్న స్టాఫే కారణం అని ఆమె తెలిపింది. మోహన్ బాబు‌పై మంచు మనోజ్ చేయి చేసుకున్నాడని.. తండ్రీ కొడుకులు నెట్టుకున్నా.. ఎవరికీ దెబ్బలు తగలలేదని తెలిపింది. ముఖ్యంగా మంచు మనోజ్‌కు దెబ్బలు తగిలినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని ఆమె తెలిపింది.

Spread the love