ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

నవతెలంగాణ – ఒడిశా: ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ పేరును బీజేపీ ఖరారు చేసింది. ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ విజయపరంపరకు బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గండికొట్టింది. ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ఎంపిక వేటలో పడింది. పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం మోహన్ మాఝీ పేరును ఈరోజు ఖరారు చేసింది. ఈయన కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 87 వేల పై చిలుకు మెజార్టీతో గెలిచారు.

Spread the love