నవతెలంగాణ – రాయపర్తి: మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.15 మంది ఎంపీటీసీలకు గాను ఆరుగురు ఎంపీటీసీలు హాజరు కాగా 39 మంది సర్పంచులకు గాను 21 మంది సర్పంచులు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. కొన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హజయ్యారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు, అధికారులు సమయపాలన పాటించకపోవడం శోచనీయం. అధికారులు సభ మొదలైనప్పటి నుండి చివరి వరకు వారి స్మార్ట్ ఫోనులతోనే బిజీ అయ్యారు. పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఆసక్తి చూపకపోవడంతో ఎట్టకేలకు తక్కువ సమయంలోనే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమారస్వామి, ఎంపీడీఓ కిషన్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిఓ రాంమ్మోహన్, ఏఓ వీరభద్రం, ఎంఈఓ నోముల రంగయ్య, రాయపర్తి పిఎస్సిఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి తదితర శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.