– ఫేక్ నగదును చలామణి చేస్తున్న వ్యక్తులను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు..
– నోట్లపై సెక్యూరిటీ ఫీచర్ను గమనించాలి ..
– ఎనిమిది మందిని గుర్తించి, ఆరుగురు సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
– జిల్లా ఎస్పీ సింధు శర్మ
నవతెలంగాణ – కామారెడ్డి
అంతరాష్ట్ర దొంగ నోట్ల తయారీ, చలామణి చేస్తున్న ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. దొంగ నోట్ల తయారీ చలామణి చేస్తున్న 6 గురు సబ్యుల అరెస్ట్ చేసే విచారించగా వారు మొత్తం 8 మంది ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని జిల్లా ఎస్పీసీ హిందు శర్మ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శుక్రవారం, తేదీ 13.12.2024 నా బాన్సువాడ పట్టణ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనముల తనికి చేస్తున్న సమయములో ఒక కారు లోని వ్యక్తులు పోలీసు వారిని చూసి వారి కారును కొద్ది దూరములో నిలిపి తిప్పి పారిపోవుటకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జాగ్రత్తపడి అ కారును వెంబడించి పట్టుకున్నారు. కారులోని ముగ్గురు వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కొలవర్ కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ పట్టుకొని కారును తనిఖీ చేయగా వారి వద్ద రూ.30 లక్షల నకిలీ కరెన్సీ పట్టుబడినవన్నారు. ఈ విషయంపై వారిని విచారించగ తెలంగాణ, కర్ణాటక, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 8 మంది సబ్యులు ఒక ముఠా గా ఏర్పడినట్లు వారు తెలిపారు అన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన రాజగోపాల్, కర్ణాటక కు చెందిన హుస్సైన్ పీరా లు ఇద్దరు నకిలీ నోట్ల తయారీ, చలామణి యందు పెట్టుబడి పెట్టారని, రాజస్తాన్ రాష్ట్రాలకు చెందిన కమలేశ్, సుఖ్రామ్, ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణ ( భరద్వాజ్ ) లు వీరు ముగ్గురు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తారు అన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన గతంలో ప్లాస్టిక్ వ్యాపారం చేసే కిరణ్ కుమార్, రమేష్ గౌడ్, మహారాష్ట్ర కు చెందిన అజయ్ఈశ్వర్ ఇట్టి నకిలీ కరెన్సీ ని చలామణి చేస్తున్నట్లుగా తెలిపారు అన్నారు.
వీరు హైదరాబాద్ లోని గౌలిగూడ, సిటిసి లలో నకిలీ నోట్ల తయారీకి అవసరమగు సామగ్రి లను కొనుగోలు చేసి బోయినిపల్లి లోని అంటిలియ అపార్ట్మెంట్ లోని పెంట్ హౌస్ ను నెలకు ఒక లక్ష అద్దె చెల్లిస్తూ కిరాయికి తీసుకొని అందులో ఇట్టి తయారీ పరికరాలను అమర్చి ఇప్పటికే 60 లక్షల విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీ ని ప్రింట్ చేయడం జరిగిందన్నారు. వాటిలో 3 లక్షల నకిలీ కరెన్సీ ని బిచ్కుంద కు చెందిన కిరణ్ కుమార్, బాన్సువాడకు చెందిన రమేష్ గౌడ్ లకు చలామణి నిమిత్తం ఇచ్చారు. వారు వారి చుట్టుపక్కల గ్రామాలల్లో వాటిని చలామణి చేసేశారు. ఈ విదంగా వారి పథకం విజయవంతం కావడంతో, మరికొంత నకిలీ కరెన్సీని తీసుకువచ్చి ఆదేవిదముగా చలామణి చేయాలని అనుకోని 30 లక్షల నకిలీ కరెన్సీ ని హైదరాబాద్ నుండి ( గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ) రాజగోపాల్ తీసుకొని వచ్చి కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ లకు ఇచ్చి ముగ్గురు కలిసి కారులో రాజగోపాల్ ను బాన్సువాడ బస్ స్టాండ్ వద్ద దింపుటకు వెళ్తుండగా పట్టుబడినారాని ఆమె తెలిపారు. తమ విచారిస్తున్న సమయంలో ఈ నోట్ల తయారీ చేసి చలామనికి సిద్దంగా ఉంచిన మిగిత నకిలీ కరెన్సీ హైదరాబాద్ లో ఉందని, హుస్సైన్ పీరా, బారద్వాజ్, అజయ్ లు హైదరాబాద్ లో ఉన్నారని నిందితులు తెలుపగా. వీరి ముగ్గురి ఒప్పుకోలు, వారి వద్ద పట్టుబడిన 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ని స్వాదీన పర్చుకొని వారిని తీసుకొని హైదరాబాద్ కు వెళ్ళి వారు తయారు చేస్తున్న అపార్ట్మెంట్ కు వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ రూ. 26 లక్షల 90 వేల విలువ గల 500 నోట్ల నకిలీ కరెన్సీ, నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన సామగ్రి అంతటినీ స్వాదీనం చేసుకొని అక్కడ ఉన్న హుస్సైన్ పీరా, భరద్వాజ్, అజయ్ లను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ మూటలో 8 మంది ఉండగా కమలేష్, సుఖ్రామ్ ప్రస్తుతం పరార్ లో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ తెలిపిన నేరస్తులు మన దేశ ఆర్థిక వ్యవస్తను దెబ్బతీయాలని, అమాయక ప్రజలను మోసాగించి వారు అధిక డబ్బులు సంపాదించాలనే దురుద్దేశం తో ఇట్టి నేరానికి పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు.
నేరస్తుల పూర్తి వివరాలు:
మొదటి నిందితుడు హైదరాబాద్లోని కొంపల్లి కి చెందిన కడపత్రి రాజగోపాల్ రావు, రెండవ నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాయచూర్ పట్టణం ఆశ్రయ కాలానికి చెందిన హుస్సేన్ పీరా, మూడవ నిందితుడైన కోలావర్ కిరణ్ కుమార్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యక్తి అని, నాలుగవ నిందితుడైన కోలవర్ రమేష్ గౌడ్ బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన వ్యక్తి అని, ఐదవ నిందితుడు ఉత్తరాఖండ్ కు చెందిన గోత్రం గ్రామానికి చెందిన రాధాకృష్ణ అని, ఆరవ నిందితుడు కమలేష్, ఏడవ నిందితుడు సుఖ్రామ్, ఎనిమిదవ నిందితుడు మహారాష్ట్ర నవి ముంబైకి చెందిన అజయ్ఈశ్వర్ లేని ఆమె పేర్కొన్నారు. ఇట్టి కేసులో పైన తెలిపిన వారిలో 6 గురు ( ఎ 1 నుండి ఎ 5, ఎ 8 ) నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుందని. పైన నేరస్తుల ఒప్పుకోలు ప్రకారం రిమాండ్ రిపోర్ట్ నందు 8 మంది ఇట్టి కేసులో నేరస్తులుగా గుర్తించడం జరిగింది. పరారీలో ఉన్న ఎ 6 మరియు ఎ 7 లను త్వరలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు. వారి వద్ద నుండి రూ. 56 లక్షల 90 వేల విలువ గల 500 నోట్ల నకిలీ కరెన్సీ, కంప్యూటర్ పరికరాలు (సిపియు, మానిటర్, కీ బోర్డ్, క్యాట్రీడ్జ్ , కలర్ ప్రింటర్, కలర్ ఇంక్ బాటిల్స్ , పేపర్ బండల్స్ , పేపర్ కట్టర్స్ , స్టీల్, కర్ర స్కేల్ , కలర్ రిబ్బన్స్ కారు నం. బి. నెంబర్, . టిస్ -17 – జి -1036, సెల్ ఫోన్స్ – 6 వాటిని స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. మీరు ఈ నకిలీ కరెన్సీ నోట్ల ప్రింటును నవంబర్లో ప్రారంభించినట్లు తెలిపారు అన్నారు.
జిల్లా ప్రజలు 500 నోట్ల తీసుకునే ముందు ఆర్బిఐ సూచించిన సెక్యూరిటీ ఫీచర్స్ ను చూసుకోవాలన్నారు. ఈ కేసులో చురుకుగా పాల్గొని పైన తెలిపిన నిందితుల కార్యక్రమాల గుట్టు రట్టు చేయడం వారిని అరెస్ట్ చేయడములో 56 లక్షల 90 వేల విలువ గల 500 నోట్ల నకిలీ కరెన్సీ వాటిని తయారు చేయుటకు వాడుతున్న వస్తువులను స్వాదీన పరచుకున్న సి.సి.యస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బాన్సువాడ టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్, పిట్లం యస్.ఐ రాజు, సి.సి.యస్ యస్.ఐ ఉస్మాన్, రాజేశ్వర్ ఏ.యస్.ఐ, హెడ్ కానిస్టేబుల్ – సురేందర్, కిషన్, కానిస్టేబుళ్లు గణపతి, రాజేందర్, శ్రావణ్, బాన్సువాడ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.