తెలంగాణను తాకిన రుతుపవనాలు..

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, నల్గొండలో ప్రవేశించడంతో పాటు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. సాధారణంగా జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు వస్తుంటాయి. ఈ ఏడాది వారం రోజుల ముందే వచ్చాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు రావచ్చని స్పష్టం చేశారు.

Spread the love