ఐదురోజుల భీకర యుద్దంలో 3,500 మందికిపైగా మృతి

Five days of fierce warగాజా: ఇజ్రాయెల్‌ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. శనివారం నుంచి మొదలైన ఈ యుద్ధం వల్ల ఐదురోజుల్లో వేలాది మంది మృతి చెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన దాడిగా గాజా అధికారులు తెలిపారు. ఈ యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌లో దాదాపు 1,200 మందికి పైగా మృతి చెందారు. అలాగే గాజా స్ట్రిప్‌లో 900 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ భీకర పోరులో పాలస్తీనా హమాస్‌ గ్రూపుకు చెందిన 1,500 మంది మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ ఇరువైపులా దాదాపు మొత్తం 3,600 మందికిపైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. గాజాలోని హమాస్‌ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ రాత్రిపూట జరిపిన దాడుల్లో కనీసం 30 మంది మృతి చెందారు. సైనిక విమానాలను గుర్తించేందుకు హమాస్‌ ఉపయోగించే అధునాతన ఫైటర్‌ జెట్‌ విమానాలను ఇజ్రాయెల్‌ సైన్యం నాశనం చేసింది.

Spread the love