నవతెలంగాణ – హైదరాబాద్
మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ ను అరెస్ట్ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. దేశంలో 9 రాష్ట్రాల్లో డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న రామ్ దాస్ ని అరెస్ట్ చేసిన అనంతరం కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడుతూ.. గత 3 నెలలుగా గంజాయి, డ్రగ్స్ సరఫరాపై నిరంతరం నిఘా పెట్టామన్నారు. రామ్ దాస్ 9 రాష్ట్రాలలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని.. రామ్ దాస్ ని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చాటువా గ్రామంలో పట్టుకున్నామని తెలిపారు. రామ్ దాస్ కి దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందన్నారు. అతను పలు రాష్ట్రాల్లో వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలిపారు. పెనమాలూరులో ఇతనిపై 3 కేసులు ఉన్నట్లు తెలిపారు. రాందాస్ పై పిడి యాక్ట్ పెడతామన్నారు. బందరుకు చెందిన బలగం నాగరాజు మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. గుడివాడలో మంచాల కిరణ్ రాజు, ఘంటసాలలో మరొకరిని అరెస్ట్ చేశామని వివరించారు.