నవతెలంగాణ సంగారెడ్డి: తల్లి, తన నాలుగేండ్ల కూతురితో కలిసి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయికోడ్ మండలంలో చోటు చేసుకుంది. రాయికోడ్ మండలం చర్ల నాగన్‌పల్లి గ్రామానికి చెందిన విజయ(32) కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిళ్లకు గురువుతుంది. దీంతో ఆమె కూతురు గౌరి (4)తో కలిసి రాయికోడ్ మండలం శిరూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.