పిల్లలను చంపి డ్రమ్ములో పడేసి…తల్లి ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : ఓ తల్లి నలుగురు పిల్లలను చంపి అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బర్మేర్ జిల్లా మండలి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బనియావాజ్ అనే గ్రామంలో ఊర్మిళ (27) తన భర్త జీతారామ్(30) కలిసి జీవిస్తోంది. ఈ దంపతులు నలుగురు పిల్లల ఉన్నారు. పిల్లల వయసు రెండు సంవత్సరాల నుంచి ఎనిమిదేళ్ల లోపు ఉంటారు. కూలీ పనుల నిమిత్తం జీతారామ్ జోధ్‌పూర్‌కు వెళ్లాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. నలుగురు పిల్లలను చంపేసి డ్రమ్ములో పడేసి అనంతరం తల్లి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు భవ్నా(08), విక్రమ్(05), విమ్ల(03), మనీషా(02), తల్లి ఊర్మిళ(27)గా గుర్తించారు.

Spread the love