నవతెలంగాణ – బొమ్మలరామారం
తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని పుట్టిన అరగంట వ్యవది లోనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలని అంగన్వాడీ సూపర్వైజర్ అన్వరున్నిస బేగం అన్నారు.సోమవారం తల్లి పాల వారోత్సవాలలో భాగంగా మండలంలోని మర్యాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లో చిన్నారులకు అన్న పస్రాన చేయించి,తల్లి పాల వారోత్సవాల గురించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు..బిడ్డ శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు దోహదపడతాయని అన్నారు. ప్రసవం జరిగిన జరిగిన అరగంట వ్యవధిలోనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు. ముర్రుపాలు బిడ్డ వ్యాధినిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుందని ఆమె తెలిపారు.ఆరునెలల వరకు తల్లిపాలనే ఆహారంగా ఇస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రామానుజన్, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ ఆశ్రీత,అంగన్వాడీ టీచర్ సంగి ఉమారాణి,రాజమణి, ఏఎన్ఎం హరిత,ఆశావర్కర్ సునీత,గర్భినులు, బాలింతలు పాల్గొన్నారు.