మార్కెట్లోకి మోటో జి54 5జి స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మోటో మార్కెట్లోకి తన కొత్త మోటో జి54 5జి ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 8జిబి, 128జిబి దరను రూ.15,999గా, 12జిబి, 256జిబి ధరను రూ.18,999గా నిర్ణయించింది. ఇందులో 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న హోల్‌ పంచ్‌ డిస్‌ప్లేను ఉపయోగించినట్లు ఆ కంపెనీ తెలిపింది. మీడియాటెక్‌ డైమన్సిటీ 7020 ప్రాసెసర్‌పై పని చేయనుందని పేర్కొంది. 6000 ఎంఎహెచ్‌ భారీ బ్యాటరీ ఉంది.

Spread the love