నవతెలంగాణ – నిజామాబాద్: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి వీధులలో (Street) ఆచూకీ లేకుండా వదిలివేసి వెళ్ళిన (Unclaimed/Abandoned vehicles) వివిధ రకములైన మోటార్ సైకిల్లు, ఆటోలు మొత్తం (226) వాహనాలను పోలీసు లైన్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు జమ చేయడమైనది అని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ సోమవారం నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేశారు. వాహనములను U/s 7 of Nizamabad (Metropolitan area) Police Act-2016 ప్రకారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం కొరకు తేదీ: 09-02-2023 రోజున పత్రికా ప్రకటన (2nd Phase Proclamation order) ఇవ్వడం జరిగింది మరియు వాహనములకు సంబంధించిన పూర్తి వివరాలను అదేరోజు వెబ్ సైటులలొ https://Twitter.com/cp-nizamabad https://www.facebook.com/cp.nizamabad (Citizen Services-abandoned / unclaimed vehicle list-2021) లో పొందుపరచడమైనది. ప్రకటన వెలువడిన నుండి (06) నెలల కాల వ్యవధి గడువు ముగిసినందున, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ (226) వివిధ రకాల వాహనాలను, బహిరంగ వేలానీకి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో తేదీ: 06-09-2023 రోజున ఉదయం సమయం 11.00 గంటలకు పోలీసు లైస్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు హాజరు కాగలరు. కావున ఇట్టి బహిరంగ వేలంలో పాల్గొనలనుకునేవారు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు (కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొందినది) మరియు ఇతర వివరాలు గల పత్రాలు వారి వెంట తీసుకొని రాగలరు. వివరాల కొరకు మోటార్ వెహికాల్ ఇన్స్పెక్టర్ శ్రీపాల్, నిజామాబాద్ ని సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ : 87126-59702 ను సంప్రదించాలన్నారు.