కువైట్ అగ్ని ప్రమాదంలో గుర్తు పట్టలేనంతగా శవాల దిబ్బలు..

నవతెలంగాణ – కువైట్ : బుధవారం కువైట్ లో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 42 మంది భారత వలస కార్మికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. అయితే, ఈ అగ్నిప్రమాదంలో కొంతమంది బాధితుల శరీరాలు తీవ్రంగా కాలిపోయాయని, దీనివల్ల బాధితులను గుర్తించడం కష్టమవుతోందని కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. బాధితులను గుర్తించేందుకు మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కారణంగా మృతదేహాల తరలింపు కొంత ఆలస్యం కానుందని వివరించారు. భారత కార్మికుల మృతదేహాలను తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇప్పటికే కువైట్ చేరుకుందని స్పష్టం చేశారు.

 

Spread the love