– రహస్య సైనిక స్థావరాలు
– శత్రువుల రాకను ముందే పసిగట్టేందుకు ఏర్పాట్లు
– శుత్రుదుర్భేద్యమైన కోటలకు నెలవు
– సేనాని పోతుగంటి మైలి సారధ్యంలో
నవతెలంగాణ – మల్హర్ రావు
రహస్య సైనిక స్థావరాలు శత్రువుల రాకను ముందే పసిగట్టేందుకు ఏర్పాట్లు, శత్రు దుర్భేద్యమైన కోటలకు నెలవు సేనాని పోతుగంటి మైలి సారథ్యంలో సేనలు. చాటుతూనే ఉన్నాయి. కాకతీయుల రాజ్యాన్ని శత్రువుల నుంచి కాపాడే బలమైన సైన్యం కదలాడిన నేల అది. పచ్చని చెట్లు, ప్రకృతి చెక్కిన చక్కని రూపాలు పులుముకున్న ఈ గుట్టలు నేటికీ ప్రత్యేకమే. మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామపరిధిలోని కాపురం ఆదివాసీ గిరిజన తండా సమీపంలో ఉన్న కాపురం గుట్టల ప్రత్యేకతపై నవ తెలంగాణ కథనం.
కాపురం గుట్టలు..
కాకతీయుల కరవాలం పౌరుషానికి సాక్ష్యాలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చారిత్రక కట్టడాలకు నెలవు. వీరుల పాదం తాకి మురిసిన రాళ్లు నేటికి పౌరుషాన్ని నిలవలేకపోయాడు. లొంగిపోయి సంది చేసుకున్నాడు. కాని విజయంలో ముప్పుతిప్పలు పడటానికి కారణం రామగిరి, ప్రతాపగిరి కోటల్లోని రహస్య దీంతో కాకతీయ సామ్రాజ్యం మొత్తం తిరిగిన పోతుగంటి మైలి చివరకు మల్హర్ రావు మండలం కాపురం సరిహద్దులోని ఎత్తైన మూడు కొండలను గుర్తించి అక్కడే కాకతీయ సైనికుల రహస్య శిబిరాన్ని ప్రారంభించాడు. కొంతకాలం పాటు ఢిల్లీ చక్రవర్తులకు స్థావరాలని గుర్తించిన మాలిక్ కాఫర్ వాటిని ధ్వంసం చేపించాడు. దీంతో ఆందోళన చెందిన ప్రతాపరుద్రుడు మరో రహస్య స్థావరం ఏర్పాటు చేయాలని కాకతీయ సైన్యద్యక్షుడుని ఆదేశించాడు.కప్పం చెల్లించిన ప్రతాప రుద్రుడు కాకతీయ రాజ్యంలో ఏర్పడిన కరువు కాట కాలతో కొంతకాలం కప్పం చెల్లించకపోవడంతో ఆగ్రహంచిన తుగ్లక్ కుమారుడు ఉల్లుఖాన్ క్రీ.శ. 1321 లో కాకతీయ రాజ్యంపై మరోసారి దండయాత్ర చేశాడు.
చరిత్ర…
భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపరిదిలో కాపురం గిరిజన తండా సరిహద్దుని అనుకొని కాపురం గుట్టలు ఉన్నాయి. అందులో ఒక గుట్టపై కాకతీయ రాజుల సైనిక స్థావరం ఉంది. అప్పట్లో కాకతీయ సైనిక అధికారులు ఈ ప్రాంతం శత్రు దుర్చేంద్యంగా ఉంటుందని భావించి ఇక్కడ రహస్య స్థావరం ఏర్పాటు చేశారు. ఇక్కడ కాకతీయ సైనికులకు కఠోర శిక్షణ ఇచ్చి వారికి యుద్ధ మెలుకువలు నేర్పించి యుద్ధానికి సిద్ధంగా ఉండేవారు. శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి స్థావరం చుట్టూ బలమైన రక్షణ గోడలను ఏర్పాటు చేశారు. స్థావరం నిర్మించేందుకు అవసరమైన డంగు సున్నాన్ని గుట్టపైనే తయారు చేసేవాళ్లు. డంగు సున్నం తయారు చేయడానికి ఉపయోగించిన రోళ్లు ఇంకా గుట్టపై చెక్కు చెదరకుండా ఉన్నాయి. సైనిక అవస రాల కోసం గుట్టపై బావులు తప్పించారు.ఈ నిర్మాణం రెండో ప్రతాప రుద్రుడి కాలం నాటిది. కాపరం గుట్ట రహస్య స్థావరానికి సమాంతరంగా పచ్చిమ దిశలో రామగిరి ఖిల్లా, తూర్పు దిశలో ప్రతాపగిరి ఖిల్లా ఉన్నాయి. క్రీ.శ. 1303 లో ఢిల్లీ చక్రవర్తి అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ బాపర్ కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. మాలిక్ భావర్ దాడిని ముందే పసిగట్టిన కాకతీయ సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి తన సైన్యంతో హుజూరాబాద్ సమీపంలోని ఉప్పరపల్లి గ్రామ సరిహద్దుల్లో ఎదుర్కొని పోరాడాడు.అప్పటికే రామగిరి, ప్రతాపగిరి కోటల్లో ఉన్న సుశిక్షితులైన సైనికుల సాయంతో మాలిక్ భాఫర్ ని ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే మాలిక్ భాఫర్ మరోసారి దండయాత్ర చేశాడు.ఈ సారి కాకతీయ సైన్యాధ్యక్షుడు పోతుగంటి మైలి సాయంతో ప్రణాపరుద్రుడు ఢిల్లీ రాజుల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. దాడిని ఎదుర్కొవడంలో కాపురం గుట్టలో శిక్షణ పొందిన సైనికులు ముఖ్య పాత్ర పోషించారు.ఓటమిని అవమానంగా బావించిన ఉల్లుఖాన్ కొంతకాలంతర్వాత మరోసారి తన సైన్యంతో కాకతీయులపై దండెత్తాడు. ఈ దాడిలో కూడా ప్రతాపరుద్రుడి సైన్యం వీరోచితంగా పోరాడింది. కాని చివరికి ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓడిపోయి బందీగా పట్టుబడటంతో కాకతీయుల పోరాటం ముగిసింది. తాము ముప్పుతిప్పలు పడటానికి కారణమైన కాపురం గుట్టపైన ఉన్న సైనిక స్థావరాలను తుగ్లక్ సేనలు ధ్వంసం చేశాయి. అలా దెబ్బతిన్న కాపురం గుట్టలు నేడు కాకతీయ చరిత్రకు సజీవ సాక్షాలుగా నిలుస్తు న్నాయి.
కట్టడాలని కాపాడాలి..
అరుదైన కాకతీయ చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న మండ లంలోని కాపురం గుట్టల్లో శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు రక్షణ కరువవడంతో కొంత మండి గుప్త నిధులు లభిస్తాయనే ఆశతో అనేక మంది గుట్టపై తవ్వకాలు జరుపుతు న్నారు. దాంతో కొన్ని కట్టడాలు ధ్వంసం అయ్యాయి. చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న కాకతీయ సంపదను కను మరుగు కాకుండా అధికారులు కాపాదాలని ప్రజలు,మేధావులు కోరుతున్నారు.
బావులు – గుహలు..
కొండలమీద కాపు కాసే సైనికుల దాహం తీర్చడానికి క్యామ్లను తలపించేలా రెండు బావులను నిర్మించారు.వర్షపునీటిని ఒడిసి పట్టేలా, పల్లంగా ఉన్నవైపు గోడ కెట్టారు. ‘కాపురంగుట్టల్లో సహజసిద్ధంగా ఏర్పడిన రెండు రాతిగుహలున్నాయి. ఇక్కడి రెండు కొండలను కలుపుతూ 500 మీటర్లమేర సహ జసిద్ధంగా ఏర్పడ్డ రాతిగోడ కనిపిస్తుంది..
కాపురం గుట్టపై బైరవి మాత ఆలయం..
మండలంలోని కాపురం గుట్టపై బైరవీ మాత అబ్బురపరిచే కొండలు తాడిచెర్ల నుండి7 కి.మీ. దూరంలో ‘కాపురం’ అనే గ్రాము ఉన్నది. ఆలయం కొలువై ఉంది అప్పట్లో యుద్ధ వీరులు బైరవీ మాతని తమ ఆరాధ్య దైవంగా పూజించేవాళ్లు.అమ్మ వారికి పూజలు చేసి జంతు బలులు ఇచ్చేవారు. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు భైరవీ మాత ఆలయంలో పూజలు చేసి యుద్ధానికి బయలుదేరేవాళ్ల గుట్టపై మరో పక్కలో ఉన్న శివాలయం, విష్ణు మూర్తి ఆలయం ఉన్నాయి.
తాడిచెర్ల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో కాపురం అనే గిరిజన గ్రామం ఉంది. ఈ పల్లె సరిహద్దులో 5వేల వేకారాల ఆయకట్టు గల కాపురం చెరువు వద్దకు వెళ్తే కొద్దీ దూరంలోనే దట్టమైన అడవి, మూడు కొండలు కనిపిస్తాయి.శత్రు దుర్భేదమైన ఈ కొండలు కాకతీయులకు సైనిక రహస్య స్థావరాలుగా ఉపయోగించబడ్డాయి.ఇందుకు సంబంధించిన ఆధారాలు కపించాయి.ఇందులోని ఒక కొండపై విష్ణుమూర్తి ఆలయం నేటికి చెక్కు చెదరలేదు.ఆలయ నిర్మాణంలో ఉపయోగించే పెద్దరాతి స్తంభాలూ ఇక్కడ లభించాయి.కొండచుట్టూ సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి గోడ ఎంతటి శతువునైనా నిలువరిస్తుంది.దీనికి పక్కనే కోట గోడలు బురుజాలు దర్శమిస్తాయి.కొండ పైభాగంలో సైనికుల అవాసాలుగా రెండు భారీ గుహలున్నాయి.