– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఓబీసీఎస్‌ఏ) ఆధ్వర్యంలో రూపొందించిన కుల గణన కోసం లక్ష పోస్టు కార్డుల ద్వారా పది లక్షల ట్వీట్‌లతో మహా ఉద్యమాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ‘కుల గణన కోసం ఉద్యమిద్ధాం’ అనే వాల్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రావణ్, తెలంగాణ సాగర సంగం అధ్యక్షుడు శేఖర్ సాగర్, తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్, మహబూబ్‌నగర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, టీిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.