మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కుల సాధన కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి
నవతెలంగాణ – చివ్వేంల
1886 మే 1న చికాగో నగరంలో కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించిన పోరాట స్ఫూర్తితో నేటి ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పైన బలమైన ఉద్యమాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి పిలుపునిచ్చారు. మేడే ఉత్సవాల్లో భాగంగా   కుడ కుడ లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కార్మికులు తమ హక్కుల సాధన కోసం చట్టాల అమలు కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను బలహీన పరుస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలపై అందర్నీ సంఘటిత పరచాలని అన్నారు. దేశంలోకార్మికులు ప్రజలు కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల పైన రాజీలేని పోరాటాలు నిర్వహించేది ఎర్రజెండా మాత్రమేనని ఆయన అన్నారు.  త్యాగాలకు పోరాటాలకు నీతి నిజాయితీకి ప్రతీకైన ఎర్రజెండాను అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. మెడే సందర్భంగా సీపీఐ(ఎం) టూ టౌన్ కమిటీ సభ్యురాలు పిండిగ నాగమణి ఎర్రజెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) టూ టౌన్ కమిటీ సభ్యులు ఉయ్యాల నగేష్, నాయకులు మద్దికుంట్ల వెంకన్న, మద్దికుంట్ల సైదులు ,డాక్టర్ లక్ష్మీనరసయ్య, కంచుగట్ల శ్రీనివాస్, ఆవుదొడ్డి భాగ్యమ్మ, సైదమ్మ, బాబుమియ,రామచంద్రు, కంచుగట్ల ఎల్లయ్య,ఏలియా, ఎలమంచమ్మ తదితరులు పాల్గొన్నారు.
Spread the love