– సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి
నవతెలంగాణ-లింగాలగణపురం
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సర్వేలు నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్య మాలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కన కారెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం గో సంగి శంకరయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా సీపీ ఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని వి మర్శించారు.నిత్యవసర, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజ లపై బారాలు మోపారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవా లని ప్రజలను మోసం చేసే పద్ధతుల్లో ప్రకటనలు చేస్తూ రా జకీయ పబ్బం గడిపే బిజెపి, బీఆర్‌ఎస్ పార్టీలకు వచ్చే ఎన్ని కల్లో బుద్ధి చెప్పాలని కోరారు. గ్రామాలలో స్థానికంగా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి సమ స్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్య క్తం చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన స్థానిక సమస్యలపై సర్వేలు చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం స్థానిక పోరాటా లు చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సందర్భంగా సీపీఎం మండల బాధ్యుడిగా తూటి దేవదానం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు రాపోలు సమ్మయ్య, గైన బిక్షం గౌడ్, మబ్బు ఉప్పలయ్య, మబ్బు వెంకటేష,్ చెన్నూరు ఉప్ప లయ్య, పాలమాకుల భాస్కర్, గండి అంజయ్య, వెంకట య్య, తదితరులు పాల్గొన్నారు.