నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ రాజ్యాధికార లక్ష్యంతో బీసీ రాజ్యాధికార సమితి పనిచేస్తున్నదని ఆ సంస్థ అధ్యక్షులు దాసు సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రాజ్యాధికార సమితి క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై యువత విరివిగా చేరుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా కోర్ కమిటీ సభ్యులు యుగేందర్ యాదవ్ నేతృత్వంలో బత్తుల శంకర్, కందాల సాయినాథ్ గౌడ్, కోడారి రాజయ్య యాదవ్‌లను ఆహ్వానించి వారికి బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.