డాక్టర్ బండివార్ విజయ్ ను నాందేడ్ లో పరామర్శించిన ఎంపీ బీబీపాటిల్

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రానికి చెందిన పశు వైద్య డాక్టర్ గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బండి వార్ విజయ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంలో చికిత్సలు జరుపుకొని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ అనారోగ్యానికి గురైన విషయాన్ని తెలుసుకున్న మద్నూర్ మండలానికి చెందిన సిర్పూర్ గ్రామ నివాసులు ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ శనివారం నాందేడ్ జిల్లా కేంద్రానికి సందర్శించి విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ను కలిసి పరామర్శించారు. ఎంపీ బీబీ పాటిల్ డాక్టర్ బండి వారు విజయ్ తో మాట్లాడుతూ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు డాక్టర్ సలహాలు సూచనలు పాటించాలని ఎంపీ ఆయనను కోరారు నాందేడ్ జిల్లా కేంద్రానికి వచ్చి పరామర్శించిన ఎంపీ బీబీ పాటిల్ కు డాక్టర్ విజయ్ ధన్యవాదాలు తెలిపారు.
Spread the love