నవతెలంగాణ – హైదరాబాద్: వికారాబాద్ కలెక్టర్ కారుపై దాడి ఘటనను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులపై దాడులు దురదృష్టకరమని అన్నారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకునే యత్నం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. దాడిని ప్రోత్సహించిన వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలుగా గుర్తించినట్లు తెలిపారు. కేటీఆర్.. తమ కార్యకర్తలను రెచ్చగొట్టి భూసేకరణ ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్బంగా ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. అధికారులపై దాడికి పాల్పడ్డ కారకులను వదిలిపెట్టబోమని ఎంపీ చామల హెచ్చరించారు.