ఉమామహేశ్వరున్ని దర్శించుకున్న ఎంపీ రాములు

నవతెలంగాణ – అచ్చంపేట
శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన మండల పరిధిలోని ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ చైర్మన్ కందూరు సుధాకర్ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు ఉమామహేశ్వరుని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి సభ్యులు ఆయనకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు ,  కుంకుమార్చన అభిషేకం చేశారు. అనంతరం ఈవో శ్రీనివాసరావు శాలువాతో  సన్మానించారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ఉమామహేశ్వరుని దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఉమామహేశ్వర క్షేత్రం భక్తి పారవశంతో వెలసిల్లుతుందని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా   ఏర్పాట్లు చేసినదేవాదాయ పాలకమండలి సభ్యులను అభినందించారు. తదితరులు ఉన్నారు .
Spread the love