సీఎంకు ఎంపీ రంజిత్‌రెడ్డి ధన్యవాదాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవోనెం.111ను పూర్తిగా ఎత్తివేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎంను కలిసిన రంజిత్‌రెడ్డి జీవోను ఎత్తివేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను సీఎం ఎత్తేశారని వివరించారు. తద్వారా తమకిచ్చిన మాటను నిలుపుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన వారిలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతోపాటు 111 జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Spread the love