ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా, భారత ప్రజాస్వామ్య రాజ్యాంగమని, మనందరికీ గర్వకారణమని శనివారం స్థానిక ఎంపీడీవో తిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని స్కూల్ తాండాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకొని, ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల పరిధిలో గల అంగన్వాడీ కిశోర బాలలకు ఏకరూప దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, అంగన్వాడి సిబ్బంది, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు బలరాం, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.