నవతెలంగాణ -పెద్దవూర
ప్రజావాణి అనేది గొప్ప కార్యక్రమమని, ప్రజలు ప్రతి సోమవారం మండల కేంద్రం లోని ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీడీఓ మహమ్మద్ ఆఫీజ్ ఖాన్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల స్థాయి ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరిస్తున్నా మని తెలిపారు. ప్రజా పాలనకు సంబంధించి ప్రజా పాలనకు అప్లికేషన్ చేసుకొని ఉండి కరెంట్ బిల్లులు జీరో రానివారు గ్యాస్ సబ్సిడీ రానివారు, ప్రజా పాలనా రశీదు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లు స్లిప్, గ్యాస్ బుక్, బాండ్
తీసుకొని మండల పరిషత్ కార్యాలయం పెద్దవూర నందు అప్లికేషన్ అప్డేషన్ చేసుకోగలరని కోరారు.