నీటిని వృధా చెయ్యకూడదు: ఎంపీడీవో

నవతెలంగాణ – చివ్వేంల 
నీటిని వృధా చేయకుండా పొదుపుగా  వాడుకొవాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలనుపెంచుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ కృష్ణయ్య  సూచించారు.  శుక్రవారం అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా చివ్వెంల మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సామూహిక ఇంకుడు గుంతను పరిశీలించి జల ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. ఇంట్లో వాడుకున్న నీటిని మురికికాల్వ లోకి పోనివ్వకుండా ఇంకుడుగుంత ను నిర్మించుకొని భూగర్భ జలాలను  పెంచుకొని భవిష్యత్ తరాలకు  నీటి ఎద్దడి రాకుండా  చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీవో గోపి, ఏపీఓ నాగయ్య, ఉపాధి హామీ  సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love