నీటీ సరఫారాలో అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలీ: ఎంపీడీవో శ్రీనివాస్

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీ కార్యదర్శులతో శనివారం నాడు గ్రామలలో మంచినీటీ సరఫారాలో సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  నిరంతరంగా నీటీ సరఫారా జర్గే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేసేందుకు ఎంపీడీవో శ్రీనివాస్ అధ్వర్యంలో సమావేశము నిర్వహించడం జర్గిందని ఎంపీవో  యాదగిరి తెలిపారు. సమావేశంలో ఎంపిడీవో శ్రీనివాస్, ఎంపీవో యాదగిరి జీపీ కార్యదర్శులతో మాట్లాడుతు  సంబంధిత గ్రామ పంచాయతీలలో వేసవి కాలంలో మంచినీటి సరఫరాపై ఎటువంటి సమస్యలు లేకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అవసరమైన చోట్ల రిపేర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి పంచాయతీ కార్యదర్శులు అందరికీ నిర్దేశించబడిన నమూనాలో సమాచారము సేకరించుటకు సూచించి ప్రతిపాదనలు తయారు చేయడం సిద్దం చేయాలని ఎంపీడీవో ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఎంపీడీవో , ఎంపీఓ గార్లు జీపీ కార్యదర్శులు తదితరులు  పాల్గొన్నారు.

Spread the love