మిస్టర్‌ బచ్చన్‌.. కీలక షెడ్యూల్‌ పూర్తి

మిస్టర్‌ బచ్చన్‌.. కీలక షెడ్యూల్‌ పూర్తిరవితేజ, హరీష్‌ శంకర్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ ‘మిస్టర్‌ బచ్చన్‌’. ఈసినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా టీమ్‌ ఒక కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసింది. రవితేజతో పాటు ఇతర తారాగణం పై సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. షెడ్యూల్‌ అనంతరం టీం, రవితేజతో కలసి పబ్లిక్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఈగిల్‌’ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేస్తుకున్నారు. రవితేజ పూర్తిగా డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్‌లైన్‌ ‘నామ్‌ తో సునా హోగా’. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. పనోరమా స్టూడియోస్‌, టి-సిరీస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రజెంట్‌ చేస్తున్నాయి.

Spread the love