శాంతాక్లాజ్ వేషధారణలో ఎంస్ఎస్ ధోనీ..

MS Dhoni dressed as Santa Claus.నవతెలంగాణ – హైదరాబాద్: దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవ సోదరులందరూ చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా ధోనీ శాంతాక్లాజ్ దుస్తులను ధరించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో సాక్షి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Spread the love