సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా

నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అని అందులో భాగంగానే సుందరీకరణ కు నిధులు మంజూరు చేయించాను అని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులు కు లాంచనంగా శంకుస్థాపన చేసారు. ఖమ్మం – అశ్వారావుపేట 325 బి.బి జాతీయ రహదారి లో 119/0 (పేరాయిగూడెం )నుండి 121/0 జంగారెడ్డిగూడెం రోడ్ లో కాకతీయ గేట్ వరకు 2 కి.మీ మేర రూ.9 కోట్లు,అశ్వారావుపేట – భూర్గంపాడ్ రోడ్ లో 0/0 (పోలీస్ స్టేషన్) నుండి 1/5 అరకిలోమీటరు వరకు. రూ. 1 కోటి 35 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ,డ్రైనేజీ నిర్మాణం,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పేరాయిగూడెం,పోలీస్ స్టేషన్ ల సమీపంలో శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు విస్తరణ,సెంట్రల్ లైటింగ్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెల్లి 23 కోట్ల 50లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు.అశ్వారావుపేట నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను అనీ,ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని,పట్టణ సుందరీకరణ లో రాజి పడేది లేదని రాష్ట్రానికి ముఖద్వారం మన అశ్వారావుపేట అని, ఒక్కొక్కటిగా అభివృద్ది చేస్తానని తెలిపారు.అలాగే సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన్ను పుర ప్రముఖులు సన్మానించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు.దశాబ్ది వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి, ఆర్ అండ్ బి డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, జె.టి.ఒ క్రిష్ణార్జున రావు, కాంట్రాక్టర్ ఎన్.టి వెంకటేశ్వరరావు, సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Spread the love