ఎంటీ మొదట ముఖ్యంగా, చిన్న కథలు, నవలల మాస్టర్. అయిన ప్పటికీ, అతని ప్రభావం సాహిత్యానికి చాలా దూరంగా విస్తరించింది, కేరళ సాంస్కతిక దశ్యాన్ని చిత్రకథా రచయిత, దర్శకుడు, సాహిత్య సంపాదకుడు, స్మతికర్త, సంభాషణ కర్త, నాటక రచయితగా చెరగని ముద్ర వేశాడు.
యువ వయసులో ప్రారంభమైన దీర్ఘకాల, ప్రసిద్ధ సాహిత్య వత్తిలో, మలయాళీలు ఎంటీ మహౌన్నత రచన, రండమూలం కోసం దశాబ్దాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది – విస్తతంగా రెండవ మలుపు అని అనువదించారు.
ఈ మహత్తరమైన రచన, మొదట ఒక ప్రముఖ వారపత్రికలో సీరియలైజ్ చేశారు. తరువాత 1980లలో పుస్తకంగా ప్రచురిత మైంది. పాండవ సోదరుల్లో రెండవ వాడయిన భీముని గాయపడిన మానసిక స్థితిని ఇది పరిశీలిస్తుంది.
సాంప్రదాయ కథన సాంకేతికత లకు మూస ధోరణులకు కట్టుబడి ఉండకుండా, ఎంటీ భీముని ప్రయా ణాన్ని పునఃకల్పన చేయడానికి, పునరావతం చేయడానికి తాజా, శుద్ధి చేసిన దక్కోణాన్ని తీసుకువచ్చాడు. మహాభారతం నాటకీయ, హదయ విదారక క్షణాలను విశదపరచాడు.
భారతీయ భాషల్లోని నవలా కారులు స్ఫూర్తి కోసం మహాభారతం నుంచి తరచుగా తీసు కున్నారు. ఇందులో మరాఠీ రచయిత వి ఎస్ ఖండేకర్ ప్రసిద్ధ యయాతి కూడా ఉంది. అయితే, ఎంటీ రండమూలం భీముని అంతర్గత ప్రపంచాన్ని అన్వే షించే మొదటి రచనగా చెప్పొచ్చు. అతని సమస్యలను ఏదైనా ఆత్మ గౌరవం కలిగిన మనిషి పోరాటాలను ప్రతిబింబించే ఆకర్షణీయమైన కథనంగా నిలుస్తుంది.
రండమూలం ముందు, ఎంటీ అప్పటికే మలయాళం ఉత్తమ కథకు లలో ఒకరిగా స్థిరపడ్డాడు. అతని నవలలు అత్యంత గౌరవ నీయమైనవి అయినప్పటికీ, పాఠకులు తరచుగా చిన్న కథను అతని నిజమైన ప్రావీణ్యం గా పరిగణిస్తారు. అతని కథలు తరచుగా మరచిపోయిన మూలల్లో సాంత్వన కోసం తహతహ లాడే పురుషులు, మహిళలు, పిల్లల దుఃఖాన్ని చిత్రిస్తాయి.
అతని కథలను ఉన్నతంగా నిలబెట్టేది అతను జాగ్రత్తగా మెరుగు పరచిన సాహిత్య నైపుణ్యం- ప్రతి పదం ఖచ్చితంగా ఎంచుకోబడేది. ప్రతి పంక్తి భావోద్వేగంతో నిండి ఉంటుంది. అతని రచన వాగ్వాదాన్ని నిరాకరిస్తుంది. వ్యక్తిగత విషాదాలను సున్నితంగా చిత్రీకరిస్తూ, అతిశ యోక్తిని నైపుణ్యంగా నివారిస్తుంది.
ఎంటీ ప్రారంభ రచనలు అతని బాల్య మూలల నుంచి బాగా తీసుకు న్నాయి. భరతపుళా నది వెంట ఉన్న గ్రామంలో, ప్రస్తుత మలప్పురం, పాలక్కాడ్, త్రిస్సూర్ జిల్లాలను కలిపే ప్రాంతం- వలువనాడ్ అని పిలిచే సామాజిక-సాంస్కతిక ప్రాంతం. అతని పాత్రలు తరచుగా మార్పు గాలిలో చిక్కుకున్న మాతస్వామ్య నాయర్ కుటుంబాల క్షీణతను ప్రతిబింబిస్తూ, మార్పులో ఉన్న సమాజం నుంచి ఉద్భవించాయి.
ఎంటీ సాహిత్య కాన్వాస్ కూడా కేరళనుండి సుదూరం దాకా విస్తరించింది – అతని నవలలు నైనిటాల్, వారణాసి వంటి దూర ప్రాంతాలకు ప్రయాణించాయి. దీనికి విరుద్ధంగా, ఎంటీ తరచుగా తన హదయం నదీ తీరంలో ఉన్న తన చిన్న గ్రామం కూటల్లూర్‌కు చెందిన దని ప్రకటించాడు. దీనిని ప్రేమగా నిలా అని పిలుస్తారు.
మలయాళ సినిమాకు ఎంటీ చేసిన కషి కూడా అంతే ముఖ్య మైంది. తరచుగా అతని స్వంత కథల ఆధారంగా, అతని స్క్రిప్ట్‌లు చెరగని ముద్ర వేశాయి. అతని పాత్రలు దీర్ఘమైన సంభాషణలను నివారించి, వేదిక, తెర మధ్య గీతను మసకబార్చే దీర్ఘమైన సంభాషణలను నివారించి, సంక్షిప్త, పదునైన, హదయ విదారక మైన పదజాలంలో మాట్లాడతాయి.
ఎంటీ దర్శకత్వ అరంగేట్రం, నిర్మల్యం, అతనికి జాతీయ ప్రశంసలు అందించింది. అయితే, అతను చలన చిత్ర నిర్మాణాన్ని చురుకుగా కొన సాగించకూడదని ఎంచుకున్నాడు. అతను అన్నింటికంటే ముందు రచయిత అని గుర్తించి ఉండవచ్చు.
మాత్రుభూమి వార పత్రిక సంపాదకుడిగా, ఎంటీ మలయాళ రచయితల ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఈ ప్రచురణ అతని పర్యవేక్షణలో దశాబ్దాల పాటు నాణ్యమైన సాహిత్యానికి ప్రమాణాన్ని నెలకొల్పింది.
ఎంటీ యూరప్, యునైటెడ్ స్టేట్స్ గురించి ట్రావెలాగ్‌ల ద్వారా కూడా తనను ప్రత్యేకంగా నిలబెటు ్టకున్నాడు, సాధారణ రిపోర్టేజీకి మించి ఈ శైలిని పెంచాడు. అతని ఆరోగ్యం సహకరించే వరకు, ఎంటీ కేరళ సాహిత్య దశ్యంలో ఒక ముఖ్యమైన ఉనికిగా మిగిలిపోయాడు, ప్రధాన సాంస్కతిక కార్యక్రమాలు, సంభాష ణల్లో తరచుగా పాల్గొంటూ.
ఎంటీ స్వరం ఎల్లప్పుడూ ధైర్యం గా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. రచయితలు తమ పనుల ద్వారా తమను తాము వ్యక్తీకరించు కోవాలని అతను నమ్మాడు.
(ముంబై నుండి నడిచే న్యూస్21 పోర్టల్ లో ఎన్ మురళీధరన్, తిరువనంత పురం వారి రచనకు అనుమతితో అనువాదం)
– డాక్టర్ పెరుగు రామకష్ణ
9849230443