మట్టి స్నానంతో ఆరోగ్యానికి మేలు

Mud bath is good for healthనవతెలంగాణ-సిద్దిపేట
మట్టి స్నానంతో వివిధ రకాల వ్యాధులను దూరం చేసే అవకాశం ఉంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ బి.ఎన్‌ స్వామి అన్నారు. పట్టణంలోని చంద్రమౌళీ గార్డెన్‌ లో ఆదివారం వ్యాస మహర్షి యోగ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి స్నాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాస్త్రం కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ యోగా రామిరెడ్డి మాట్లాడారు. ప్రముఖ యోగ శిక్షకులు తోట సతీష్‌ ఆధ్వర్యంలో మట్టి లేపనంతో సాధకులు యోగ సాధన చేశారు. వివిధ ఆయుర్వేద వనమూలికలు కలిపి ప్రత్యేకమైన మట్టిని తయారు చేశారు. దాదాపు ఇందులో 100 మంది సాధకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షులు నిమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు తోట అశోక్‌ , గౌరవాధ్యక్షులు కే. అంజయ్య, గంగాపురం శ్రీనివాస్‌, బసవరాజు కుమార్‌, పల్లె సురేష్‌, రాజమల్లయ్య, వేణు, భారత స్వాభిమాన్‌ ట్రస్ట్‌ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రంగాచారి, సిద్దిపేట జిల్లా భారత స్వాభిమాన్‌ ట్రస్ట్‌ సభ్యులు రాములు, వాసు తదితరులు పాల్గొన్నారు.

Spread the love