
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదినం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముధోల్ మండలం నుండి బీజేపీ నాయకులు, అభిమానులు, అధిక సంఖ్యలో భైంసా లోని ఎమ్మెల్యే నివాసం లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం మండల నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా భైంసాలో రక్తదానం శిబిరంలో రక్తదానం చేశారు. ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు కోరిపోతన్న, మండల నాయకులు నర్సాగౌడ్, పి ఎ సిఎస్ డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, మాజీ ఎంపిటిసి దేవోజి భూమేష్, లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ నిమ్మ పోతన్న, యువ నాయకులు పట్టేపురం సతీష్ రెడ్డి, దత్తాద్రి, శ్రీనివాస్, గురుప్రసాద్, బోజన్న, సప్పటోల్ల పోతన్న, సంతోష్ ,ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.