ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ను కలిసిన ముదిరాజ్ సంఘం నాయకులు

నవతెలంగాణ-రాయపోల్: రాష్ట్ర శాసమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ ను రాయపోల్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ముదిరాజుల సమస్యల గురించి చర్చించడం జరిగింది. రాజకీయంగా ముదిరాజులు వెనుకబడి ఉన్నారని ముదిరాజులను రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కలిసికట్టుగా అవగాహన కల్పించేందుకు కృషి చేద్దామన్నారు. రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేద్దామని ఇతర సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ మాజీ సర్పంచ్ సింగర బోయిన స్వామి, తిగుళ్ళ స్వామి,పాపని నరేష్, ఉప్పరి రాజు, శేరి స్వామి, మందరాజు, తిగుళ్ల కృష్ణ, గజం కృష్ణ, తిగుల్ల నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love