– మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా ప్రభుత్వం ముది రాజ్ కులాన్ని అవమానించిందని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థికసా యం జాబితాలో ముదిరాజ్ కు లాన్ని పొందుపర్చక పోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముదిరాజ్‌లు బీసీ కులాల్లో లేరా? ముది రాజ్‌లకు కుల వృత్తి లేదా? అని ఆందోళన వ్యక్తంచేశారు. వృత్తిదారులకే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం స్వాగతనీ యమని, కానీ ముదిరాజ్‌లను విస్మ రించడం ఎంత వరకు సబబని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అధిక ఓటింగ్ శాతాన్ని కలిగి ఉన్న ముదిరాజ్‌లను బీసీ సంక్షేమ శాఖ ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదో సమాధానం చెప్పాలని అన్నారు.