నల్లగొండ సీపీఐ(ఎం) అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

– కోవిడి సమయంలో 16 కోట్ల రూపాయల విలువైన సామాగ్రి పేదలకు పంపిణీ
 – కోవిడ్ రెండవ దశలో   పార్టీ కార్యాలయంలోనూ కోవిడ్ ఐసోలేషన్ ఏర్పాటు
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
శాసనసభ ఎన్నికలు 2023  లో 92 నల్గొండ నియోజకవర్గము నుండి సిపిఐఎం అభ్యర్థిగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ ప్రకటించింది.
 జీవిత విశేషాలు…
పేరు :   ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
తల్లిదండ్రులు :  ముదిరెడ్డి లింగారెడ్డి, చంద్రమ్మ దంపతులకు 1969లో జన్మించారు.   సుధాకర్ రెడ్డి వారికి మూడవ సంతానం.
పుట్టింది :   ఇందుగుల గ్రామం,  మాడుగుల పెళ్లి మండలం,  నల్లగొండ జిల్లాలో జన్మించారు.
విద్యాభ్యాసం : మఠంపల్లి లో హై స్కూల్ వరకు, మిర్యాలగూడలోని  మిషనరీ స్కూల్లో ఇంటర్ వరకు,   నాగార్జున డిగ్రీ కాలేజీ నల్లగొండలో డిగ్రీ పూర్తి చేశారు. అదేవిధంగా  ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ను  పూర్తి చేశారు.
ఉద్యమ ప్రస్థానం : 1980లో సీపీఐ(ఎం)లో ప్రాథమిక సభ్యుడిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభం. ఆ తర్వాత  డివిజన్ కమిటీ సభ్యులుగా, తిప్పర్తి మండల కార్యదర్శిగా, నల్గొండ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం నల్లగొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా   విద్యార్థి, యువజన సంఘాల్లో పనిచేస్తూ ప్రస్తుతం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో అనేక ప్రజా పోరాటాలలో ప్రముఖ పాత్ర వహించి పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. నలగొండ నియోజకవర్గానికి ఎస్ ఎల్ బి సి సాగు, త్రాగునీరు సాధన కోసం, వరద కాలువ నిర్మాణం కోసం అనేక ఉద్యమాలు నడిపారు. ఇవే కాకుండా తిప్పర్తి మండలానికి కృష్ణా జలాలను త్రాగు ,సాగు నీటి కోసం పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళనలు చేశారు. 2006 లో  తిప్పర్తి జడ్పిటిసి గా ఎన్నికై సిపిఎం తరపున జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆ సందర్భంలో తిప్పర్తి మండలం అనేక గ్రామాలకు వాటర్ ట్యాంకులు నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం కోసం, లో వోల్టేజీ సమస్య పరిష్కారం కోసం అనేక ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్ల పెట్టుటకు కృషి చేశారు. గ్రామీణ ప్రజల అవసరాలైన ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి పాదయాత్ర నిర్వహించి తాసిల్దార్ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం ఆందోళన నిర్వహించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సుమారు 16 కోట్ల రూపాయల విలువైన వస్తు సామాగ్రిని పేదలకు పంపిణీ చేశారు. అలాగే రెండో వేవ్ లో సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ పెట్టి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందుకోసమే సిపిఐ(ఎం) అభ్యర్థులను చట్టసభల్లోకి పంపితే ప్రజా అవసరాల కోసం నినదించి సాధిస్తారని తెలిపారు.
Spread the love