వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం

 

నవతెలంగాణ – హైదరాబాద్ : ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం రాజకీయ రీ ఎంట్రీ సస్పెన్స్‌ కు తెరపడింది. ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు తనయుడు గిరి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ముద్రగడ రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరగడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు కూడా జరపడంతో ఆ పార్టీలో చేరడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముద్రగడ అనూహ్యంగా వైసీపీలో చేరబోతున్నట్టు స్వయంగా ఆయనే ఇటీవల ప్రకటించారు. మొన్ననే ఆయన పార్టీలో చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.  నేడు వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ నేతగా మారిపోయారు.

Spread the love