జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తేదీ 09-01-2025 నా జిల్లా కలెక్టర్ కార్యాలయములో రహదారి భద్రత పై గురువారం ముగ్గుల పోటీ నిర్వహించరు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, మరియు హెూమ్ గార్డ్స్ పాల్గొన్నారు.
భవిత పాఠశాలలో…
రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమములో భాగంగా కామారెడ్డి సహాయక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి జిల్లా కేంద్రంలోని భవిత పాఠశాలలో ముఖ్య అతిథి గా పాల్గొని భవిత స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హెూమ్ గార్డ్స్ పాల్గొన్నారు.