హైదరాబాద్ : ఫోన్‌పేకు చెందిన పిన్‌కోడ్ యాప్‌లో తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ లోకల్ బ్రాండ్ స్టోర్లు జత అయ్యాయని ఆ సంస్థ తెలిపింది. నగరంలోని విజేత సూపర్ మార్కెట్, బాలాజీ గ్రాండ్ బజార్, అక్షయ కల్ప, ప్రోవిలాక్ మిల్క్, ప్రవర్ష డెయిరీ, గోదావరి కట్స్ లాంటి పలు బ్రాండ్లు ఇప్పుడు పిన్‌కోడ్‌లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. దీంతో తమ స్టోర్ ఫస్ట్ ఇ-కామర్స్ వేదికలో అనేక రకాలైన కిరాణా సరకులు, తాజా పండ్లు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చామని పిన్‌కోడ్ సిఇఒ వివేక్ లోచబ్ తెలిపారు.