– ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు
నవతెలంగాణ – ములుగు
అభివద్ధిలో ములుగు జిల్లా పరుగులు తీస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్‌రావు అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘ నంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం ఎస్ ప్రభాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలిస్ గౌరవ వందనం స్వీకరించారు. అనం తరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉంద న్నారు. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచు కున్న ఈ రోజును తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా జరుపుకుంటున్నామన్నారు. నాటి పోరాట యోధులు, మహణీయులను తలచుకోవడం అందరి బాధ్యత అన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ 60 సంవ త్సరాల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించి,. నేడు స్వరాష్ట్ర మై అన్ని రంగాల్లో అద్భుత అభివృద్ధి సాధిస్తోందన్నారు. అన తికాలంలో దేశం లోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిం దన్నారు. మలుగు జిల్లాలో రైతుబంధు ద్వారా ఇప్పటి వరకు 78వేల26 మంది రైతులకు రూ.83 కోట్ల 22 లక్షలు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 1030 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా ద్వాఆరా రూ.51 కోట్ల50 లక్షలు నామినీల ఖాతాలలో జమ చేశామన్నారు. అలాగే పంట రుణమాఫీ చేశామన్నారు. ములుగు వైద్య కళా శాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేశారన్నారు. జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా కేటాయించార న్నారు. జిల్లా డయాగస్ట్రిక్ హాబ్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పోరేట్ అస్పత్రులకు ధీటుగా అభివద్ది చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో కేసీఆర్ కిట్లు, కేసిఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశామన్నారు. జిల్లాలో జూన్‌లో ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించి ఇప్పటి వరకు 3892 మందికి పరీక్షలు చేసినట్టు చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా 91.19 శాతం సమస్యలు పరిష్కరించామన్నారు. యునె స్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వద్ద మౌలిక సదుపాయాల పనులు చేపట్టామన్నారు. రూ.13కోట్ల42 లక్షలతో మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద అభివద్ధి పనులు చేశామని అన్నారు. ఇలా జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. వచ్చే 2024 మేడారం మహా జాతర విజయవంతం చేయుటకు గాను 75 కోట్ల నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం, జిల్లా ఇంఛార్జి అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న, ఒస్డి అశోక్ కుమార్,ఆర్డీఓ కే. సత్య పాల్ రెడ్డి, అదనపు ఎస్ పి సదానందం, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, ఎంపీపీలు గండ్ర కోట శ్రీదేవీ, శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీలు గై రుద్ర మదేవి, హరిబాబు, సీఈఓ ప్రసూన్న రాణీ, వైద్యాధికారి అప్పయ్య, డీసీఓ సర్దార్ సింగ్, డీఏఓ గౌస్ హైదర్, తదితరులు పాల్గొన్నారు.