భారీ వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలం..

– భారీ వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలం
– ముంచెత్తుతున్న వానలు… మునిగిపోతున్న గుడాలు
– గండ్లు పడ్డ చెరువులు, వాగులు.. నిలిచిపోయిన రాకపోకలు
– యుద్ధ ప్రాతిపదికన సహా చర్యలు చేపడుతున్న అధికారులు
– వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు 36 మంది ప్రయాణికులను కాపాడిన పోలీసులు
– జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
నవతెలంగాణ-ములుగు : గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా అంత అతలాకుతనంగా మారింది. భారీ వర్షాలతో గ్రామాలు, రోడ్లన్నీ జలమయ్యాయి. వాగులు వంకలు వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు సమీపంలోని మేడి వాగు వద్ద వరద జాతీయ రహదారిపై ప్రవహించడం, పస్రా సమీపంలోని గుండ్ల వాగు బ్రిడ్జి కి గండిపడడంతో కింది మండలాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. జంపన్న వాగు ఉధృతికి మేడారం రెడ్డిగూడెం, ఊరటం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు జంపన్న సమీపంలో చిరు వ్యాపారులు 8 మంది వరదలో చిక్కుకోవడంతో రిస్క్రి టీం బృందాలు పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మంగపేట సమీపంలోని బోర్ నర్సాపూర్ మధ్య అలా గౌరారం వాగు బ్రిడ్జిపై వరద ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మండలం బూరుగుపేట, లక్ష్మీదేవి పేట్ గ్రామాల మధ్య గల మారేడుగొండ గండి చెరువులో నీరంతా వృధాగా పోవడంతో పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు మండలం జాకారం సమీపంలోని పనేసా మోరి వద్ద హైదరాబాద్ నుంచి మంగపేట 36 మందితో వెళ్తున్న సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు వరదలుచుకోకపోవడంతో ప్రయాణికులు అరుపులు కేకలు వేయడంతో పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటా హుడినా అక్కడ చేరుకొని ప్రయాణికులను రక్షించారు. ఏలాంటి ప్రాణ ,ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలో నిమగ్నమయ్యారు.
Spread the love